Wednesday 16 September 2015

మాయం అయితే ఎంతబావున్ను.


మాయం అయితే ఎంతబావున్ను..
రెండు ముఖాల ఈ జనం నుంచి..
పెదవి మీద ప్రేమల నుంచి..
మాయం అయితే ఎంత బావున్ను..

చూశారా...
దశకంఠుని సంతతి..
రక్తబీజుల్లా.. వాడ వాడలా పుట్టుకొస్తున్నారు..
ముఖాలు మార్చి మార్చి ప్రదర్శిస్తున్నారు..
లౌక్యం ముసుగులో వలలు విసురుతున్నారు..
ఈ వలలకు దొరకకుండా పారిపోతే ఎంతబావున్ను..

శుష్క అభిమానాలు చూపి..
మార్కులు కొట్టేస్తున్నారు..
వల్లమాలిన ప్రేమలతో పుట్టెను ముంచేస్తున్నారు..
ఈ ప్రేమల బారిన పడకుండా..
వీల్లందరి మధ్య నుంచి..
పక్కకు జరిగితే ఎంతబావున్ను..

మొహమాటం చట్రం ఛేదించి..
నిఖ్కచ్చి ఖడ్గం ధరించి..
ముక్కుసూటి మాటల...
రక్షణ కవచం ధరిస్తే బావున్ను..
పాలు నీళ్లు వేరు చేసే శక్తి వుంటే ఎంత బావున్ను
బిడియం కర్పరం నుంచి బయట పడితే
ఎంతబావున్ను
-- నాగ్
ఫోటో: గూగుల్ వారిది.. అసలు యజమాని తెలీదు.. వారికి కృతజ్ఞతలు

No comments:

Post a Comment