Monday 21 September 2015

లక్ష్మణ్ కుమారుడు చెప్పిన ప్రవర

ఆయన జగమెరిగిన క్రికెటరు..
దేశ విదేశాల్లో తన బ్యాట్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన బ్యాట్సు మెన్..
ఎన్నో సంస్కృతులు.. సంప్రదాయాలు చూసి వుంటాడు..
అయితేనేం.. 
తన పిల్లలను చక్కని క్రమశిక్షణతో పెంచాడు.. సంప్రదాయాన్ని దాటిపోలేదు..
ఆయనే వివి ఎస్ లక్ష్మణ్
ఆయన కుటుంబ సమేతంగా సోమవారం పాదగయను సందర్శించారు..
దర్శనాదులు పూర్తి అయ్యాక..
పండితుల ఆశీర్వచనం కావించారు..
ఆ సమయంలో
లక్ష్మణ్ కుమారుడు సర్వజిత్ 
పండితులకు తాంబూలం సమర్పిస్తూ..
శాస్త్రోక్తంగా.. తన గోత్రాధి పరంపరను ప్రవరను వల్లించిన తీరు అద్భుతం అనిపించింది..
ఈ మధ్య సామాన్యులు సైతం..
ఇంగ్లీషు మీద మోజుతో తమ పిల్లలకు కాన్వెంటు చదువులు చెప్పిస్తున్నారు.. ఆ సంస్కృతికే అలవాతు పడితోతున్నారు.. మన సంప్రదాయాలను విస్మరిస్తున్నారు..
ఈ క్రమంలో ప్రముఖ క్రికెటర్ అయినా అక్ష్మణ్ కుమారుడు
శాస్త్రోక్తంగా చెప్పిన ప్రవర అద్భుతంగా తోచింది..
ఆ చిన్నారు..
"ప్రవారుషే
ఆంగీరస భారహస్పస్య బారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రహ:"
అంటూ.. (తప్పులుంటే పండితులు క్షమించాలి) ప్రవర చెప్పి
పెద్దలకు నమస్కరించే విధానం.. చక్కగా తోచింది..
పైగా కుటుంబం మొత్తం శాస్త్ర బద్దమైన వస్త్ర ధారణలోనే వున్నారు..
ఎంత మంది ఆయనతో ఫోటోలు దిగినా చాలా ఓపికగా సహనంతో నడుచుకున్నారు..
అందుకే టెస్ట్ కింగ్ అయ్యాడు..
ఎదిగినా ఒదిగడం.. గొప్పవారి లక్షణం..
--నాగ్
నోట్ : నచ్చితే షేర్ చేయండి.. కానీ కాపీ చేయొద్దు..
ఫోటో :చెవులు పట్టుకుని వినయంగా ప్రవర చెబుతున్నవివిఎస్ లక్ష్మణ్ కుమారుడు

11 comments:

  1. Prayarusheya kadu thrayarusheya 😊

    ReplyDelete
  2. ధన్యవాదాలు శ్రీ వత్స గారు..
    మార్పు చేశానండీ..

    ReplyDelete
  3. ధన్యవాదాలు సర్

    ReplyDelete
  4. Sathya Sai Baba blessed this guy and named him Sarvajith. May god bless him!!

    ReplyDelete
  5. ధన్యవాదాలు సర్

    ReplyDelete
  6. where is this place(Pada gaya)?

    ReplyDelete
    Replies
    1. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు 18 కి.మీ
      కాకినాడ అన్నవరం రోడ్డులో వుంటుంది..
      అష్టాదశ శక్తి పీఠాల్లో పదో పీఠం పుర్హూతిమా మాత కొలువు తీరి వున్న క్షేత్రం
      త్రిగయల్లో ఒకటైన పాదగయ ఇది..
      ఇక్కడి శివుడు రాజరాజేశ్వరీ సమేట ఉమా కుక్కుటేశ్వర స్వామి
      స్వయం భూః
      కుక్కుట(కోడి పుంజు)రూపంలో వుండే స్పటిక లింగం
      ఇదే క్షేత్రంలో దత్తత్రేయుడు స్వయం భూః గా వెలిశాడు
      ధన్యవాదాలు

      Delete
  7. Replies
    1. ముద్రారాక్షసం..
      మార్పు చేశానండీ
      ధన్యవాదాలు

      Delete