Monday 14 September 2015

నే ఒంటరినా..

నే ఒంటరినా..
అలా అంటారేమిటి అంతా..
నీ తలపులు నా వెంట వుండగా..
ఒంటరెలా అవుతాను..

నే దురదృష్ట వంతుడినా..
అదేమిటి అలా చూస్తారంతా..
నీ పరిచయం అదృష్టమేగా..

నే ఏమీ లేనివాడినా..
ఏమో అంటున్నారంతా..
నీ జ్ఞాపకాల సంపదంతా నాదేగా..

నే పనిలేనివాడినా..
తిడుతున్నారంతా ఎందుకలా..
నీతో గడిపిన క్షణాల లెక్కల్లో
ఊపిరి సలపకుండా వుంటే..

నా వెంట నువ్వు లేవా..
నా పక్కన వెదుకుతున్నారంతా..
నా శ్వాసలో శ్వాసగా వున్నది నీవేగా..

నే ప్రేమ పిచ్చివాడినా..
మిత్రులు పిలుస్తున్నారలా..
ఏమో ప్రేమించడమే పిచ్చే అయితే..
నేనూ అదేనా..

--నాగ్

No comments:

Post a Comment