Wednesday 16 September 2015

మా నాన్న

నేను.. ఫాదర్స్ డేకి వ్యతిరేకం కాదు..
అలా అని మద్దతూ లేదు.
ప్రతిక్షణం మన అభివృద్ధికీ.. పుట్టుకకీ కారణం అయిన
తల్లిదండ్రులను తలచుకుంటూనే వుంటాం.
కానీ అనంత లోకాల్లో లీనమైన నా తండ్రిని
పరిచయం చేయడానికి ఫాదర్స్ డే..
ఒక అవకాశం ఇచ్చిందని భావిస్తున్నాను.
మా నాన్న గారు సూర్య ప్రకాశరావు..
కాకినాడ ఒన్ టౌన్ లో కానిస్టేబుల్ గా రిటైర్ అయ్యారు..
18ఏళ్ళక్రితం స్వర్గస్తులయ్యారు...
నా జ్ఞాపకాల దొంతర్లలో పై పేజీలు ఆయనవే..
కొడుకులతో స్నేహంగా వుండే తండ్రుల గురించి సినిమాల్లో
చాలా వెకిలిగా చూపడం నాకు తెలుసు..
కానీ ఆ రోజుల్లోనే ఎదిగిన కొడుకుతో ఒక తండ్రి నమ్మకమైన స్నేహితుడిగా
ఎలా వుండాలో ఆయనను చూసి తెలుసుకున్నాను..

--నాగ్

No comments:

Post a Comment