Monday 14 September 2015

అవునా... అవునేమో..

అవునా... అవునేమో..
నీ చూపులో ఆ కవ్వింపు..
కనురెప్పలో తడబాటు..
అదరంలో సన్నని ఒణుకు..
ఆ చెక్కిలి నునుపులో కాంతి
ప్రేమేనా.. ఏమో..
నను చూస్తూనే నీలో ఆ మార్పు..
నన్ను దరిచేరగనే నీ మౌనం..
నేలపై నీ కాలి వేలు గీచే సున్నాలు..
నీ కొంగు చివరల ముడులు..
ప్రేమేనా.. అవునేమో..
నా పేరు వినగానే....
నా గాలి సోకగానే..
నా కాలి సవ్విడి కాగానే..
నీలో ఆ స్పందన..
ప్రేమేనా.. నిజమా..
నీ స్పందన నాకు కనిపిస్తున్నా..
నీ భావం నాకు వినిపిస్తున్నా..
నీ కోరిక నన్ను తాకుతున్నా..
తెలిసీ తెలియనట్టు నటిస్తున్నా..
క్షమించు చెలీ..
నే అశక్తుడిని.. దుర్బలుడిని
సమాజపు చట్రం దాటలేని అసమర్థుడిని
-- నాగ్

No comments:

Post a Comment