Wednesday 16 September 2015

పచ్చని సీమలో ఎర్రని మంటలు..

పచ్చని సీమలో ఎర్రని మంటలు..
నిద్రలేచేలోగానే శాశ్వత నిద్ర కౌగిలి
అమ్మా అని పిలిచేలోగా బిడ్డ..
నాయనా అనేలోగా తండ్రి..
.ఒకరికొకరు ఎవరికి ఎవరూ. కాకుండా పోయారు
అధికార నిర్లక్ష్యం అగ్నికీలగా మారితే..
అభం శుభం తెలియని జనం సమిదలయ్యారు..
ఎన్నో ఆశలు.. కలలు.. భూడిదయ్యాయి..
సుతిమెత్తని చిన్నారుల శరీరాలు బొగ్గులయ్యాయి
ఇది ఘోర కలి.. అగ్నిభట్టారకుని ఆకలి..
ఎన్నిలక్షలిచ్చినా పరిహారం..
ఈ ప్రాణాలకి సమానం..?
ఆ మంటలు మనసుకు తగిలితే..
గుండె కరిగితే..
ఒక కన్నీటి బొట్టు రాల్చుదాం..

--నాగ్

No comments:

Post a Comment