Wednesday 16 September 2015

అల్లూరి సీతారామ రాజు కొల్లగొట్టిన పోలీసు స్టేషన్లలో చింతపల్లి ఠాణా

ఈ రోజు మన్యం వీరుడు అలూరి సీతారామ రాజు జన్మదినం సందర్భంగా మిత్రులకు శుభాకాంక్షలు
అల్లూరి సీతారామ రాజు కొల్లగొట్టిన పోలీసు స్టేషన్లలో చింతపల్లి ఠాణా ఒకటి.. 1922 ఆగస్టు 22న తూర్పులో దేవీపట్నం పోలేసు స్టేషన్ తో పాటూ.. చింతపల్లి ఠాణా కూడా ఒకేసారి దోచేశారు.. అంత దూరం కొన్ని గంటల్లో ఎలా ప్రయాణించారో అంతుపట్టని నిజం.. ఇక్కడి తుపాకులు సేకరించిన అల్లూరి ఇక్కడి రికార్డుల్లో వివరాలు రాసి సంతకం చేసి వెళ్ళారట.. ఆ వివరాలు ఇప్పటికీ ఆయన సంతకం సహా ఇక్కడి రెవెన్యూ రికార్డుల్లో వున్నాయి..
ప్రస్తుతం ఈ ఠాణాను యధాతదంగా వుంచి ఉప ఖజానాగా వుపయోగిస్తున్నారు..

అల్లూరి నడయాడిన నేలని తాకినందుకు ఆనందంగా వుంది...
ఈ సందర్భంగా ఆయనకు నా నివాళీ

--నాగ్

No comments:

Post a Comment