Wednesday 16 September 2015

.... చివరి చూపు

మస్థిష్కంలో గందరగోళం..
మనసు కడలిలో.. కష్టాల కెరటాలు..
ఒడ్డు చేరలేక..
తంటాలు పడుతున్న సమస్యలు
ఆందోళన చీకటిలో బతుకు నావ
ఎటు పోతుందో తెలియని అయోమయం
ఆనందపు చినుకులు సైతం..
ఎదురు తిరిగి తుపానుగా మారుతుంటే..
భయం. భయం..

దారిచూపే చుక్కాని విరిగిపోతే..
ఆసరా తెరచాప చిరిగిపోతే..
మాటల ఈదురు గాలులు తూట్లు పొడుస్తుంటే..
ఆందోళన.. అందోళన..

గమ్యం తెలిసినా చేరలేని దుస్థితి
దరినే తీరం వున్నా గుర్తించలేని పరిస్థితి..

విరిగిన చుక్కాని సరిచేసి..
చిరిగిన తెరచాపను సమకూర్చి..
గమ్యం దరి చేర్చేవాడి కోసం ..
ఆశతో ఎదురు చూపు
చివరి వరకూ చూపు..
.... చివరి చూపు

--నాగ్

No comments:

Post a Comment