Wednesday 16 September 2015

మునుమాపు వేళ..

మునుమాపు వేళ..
పక్షులు గూళ్ళకు చేరుతున్నాయ్.
పశువులు కొట్టాలకు వస్తున్నాయ్
నువ్వు రావేం..
తలార స్నానంచేసి..
ఉతికిన చీర కట్టా.. నువ్వు తెచ్చిందే లే
నీ కిష్టమని తల ఆరబోశా..
ఎక్కడా..కనిపించవేం..
తెల్లార గట్ట నువ్వు పెట్టిన ముద్దు
గుర్తుకొస్తోంది..
నడిరేతిరి నా చెవి కొరికిన నొప్పి
ఇంకా అలానే వుంది
ఇంత కర్కశం ఎక్కడ నుంచొచ్చిందీ..
పూలు నలుగుతున్నాయన్నా వినవేం
అందుకే మల్లె పందిరి అలిగినా..
ఇప్పుడు పూలే పెట్టుకోలేదు..
అన్నీ చల్లేశా.. మంచం మీద
నీకు తెలుసా..నువ్వెళ్తూ..
నా మనసుకూడా తీసుకెళ్ళావ్
మతిలేని పనులతో ఇక్కడ సతమతం అవుతుంటే..
గూటిలోని దీపం పగలబడి నవ్వుతోంది.
తలుపు మాటున ఎదురు చూపు..
నాకు తోడుగా ఇంటి గడప..
నీ తలపులో మత్తు..
ఎదురు చూపులో గమ్మత్తు
నన్ను నిలవనీయడం లేదు
అదేమిటో..
నువ్వున్నా.. లేకున్నా ఆనందమేనా
--నాగ్

No comments:

Post a Comment