Wednesday 16 September 2015

మంటలు.. మంటలు.

మంటలు.. మంటలు..
రోడ్డుపై కొస్తే చాలు భానుడి కోపాగ్నులు..
షాపింగ్ మాల్ కు వెళ్లా..
అక్కడా మంటలే..
నిప్పులు చెరుగుతున్న ధరలు
చిరాకు వేసి..ఇంటికొచ్చా..
ఇక్కడా మంటలే.. కరెంట్ కోత వెతలు
కుదుట పడటానికి పేపరు తీశా..
అవే మంటలు..
కొత్త రాజధాని తంటాలు
పిల్లల్ని పిలిచా కాలక్షేపానికి..
ఇక్కడా మంటలే..
స్కూల్ ఫీజుల, పుస్తాకాల ధరల మోతలు
ఇలా కాదని ఆఫీసు బాట పట్టా..
వెంటాడాయి మంటలు..
రాష్ట్ర విభజనలో ఉద్యోగ కష్టాలు
చిరాకు పడి రోడ్డెక్కా..
అక్కడా మంటలే..
ఇంజను లోపాలతో అంటుకున్న బస్సు
జంక్షన్ లో నలుగురి చర్చల మంటలు..
కంగారుగా ఇంటి దారి పట్టా..
ఎదురుగా మా ఆవిడ కన్నీటి మంటలు
ఐదేళ్లుగా సాగుతున్న టీవీ సీరియల్..
అయిపోయిందట.
మనశ్శాంతి కోసం ముఖచిత్రం ఓపెన్ చేసా..
అక్కడా ఎర్రని నాలుకలే..
అవినీతి నేతల భాగోతాలు.
ఏడుకొండలవాడా.. కాపాడు..
అక్కడా మంటలే..
బ్లాక్ లో ఆర్జిత సేవల టిక్కెట్లు..

ఎవరు ఆర్పగలరు.. ఈ మంటలు..
అవును ఎవరూ ఆర్పలేరు..
ఎందుకంటే..ఇవి రావణ కాష్టాలు
మనకు మనమే అంటించుకున్న చితులు

--నాగ్
ఫోటో: గూగుల్ వారిది.. అసలు యజమాని తెలీదు.. వారికి కృతజ్ఞతలు


No comments:

Post a Comment