Tuesday 15 September 2015

చినుకు.. పడితే..


చినుకు.. పడితే..
చాలు ఇదిగో..
మా ఊరి మార్కెట్ కు తరలొచ్చేస్తాయి మొక్కలు..
వాటిలో వంగ, టమోటా.. బెండ తదితర నారు వుంటుంది..
అలాగే కనకాంబరం, బంతి, చామంతీ మొక్కలు కూడానూ..
విత్తనాల కొట్లు సరే సరి..
తమ పొలాల్లో వేసుకోడానికి విత్తనాలు చల్లిన రైతులు ఎక్కువైన నారును ఇలా 
అమ్ముతారు.. అయితే అమ్మడానికే నారు సిద్దం చేసే వాళ్లూ లేకపోలేదు..

--నాగ్
ఫోటో : మా ఊరి సంతలో తీసింది..

No comments:

Post a Comment