Monday 14 September 2015

మనం కోరింది కాదు..

మనం కోరింది కాదు..
మనమూహించిందీ కాదు..
వచ్చి పడింది..
తలలేని మొండెంలా రాష్ట్రం..
రాజ్యానికి ప్రజలు.. రాజు ..
వుంటే సరా..
రాజథాని వద్దూ..
భూమి పంచేస్తే చాలా..
పోషణ చూడొద్దూ..!
ఏ చాణక్యుడు చెప్పాడీ రాజనీతి..
కొత్త కాపురానికి కూడా
ఏడాది గ్రాసం ఇవ్వడం..
మన సంప్రదాయమే..
కొత్తపాలనకు ఆ పాటి ఆనవాయితీ లేదూ..
పంచాయితీ చేసినోళ్లు పోయారు..
మాట సాయం పెద్దలు మాట్లాడరు..
పొడిచేస్తామని గద్దెనెక్కినోళ్లు..
భిక్షమెత్తుతున్నారు..
రాజథాని నిర్మాణానికి రాల్లెత్తే వాళ్లు కాదు..
బొచ్చెలో కాసులేసేవాళ్లు కావాలట..

తెలుగు తల్లికి ఎంత దుస్టితి..
బిడ్డల చదువులు చట్టిబండలై..
ఉపాధి ఉట్టెక్కి..
పొలాలు బీటలు వారితే..
అనాథలా ఆంధ్రమాత..
ఆటవిక న్యాయమే గెలిచింది..
అతిపెద్ద ప్రజాస్వామ్యం అబాసుపాలైంది..
తెలుగు తమ్ముడు నోరు మెదపడేం..
--నాగ్

No comments:

Post a Comment