Sunday 13 September 2015

ఇది బావుందా..

ఏమైనా ఇది బావుందా..
చిన్నారి మనసును కదిలించి..
కనుమరుగు కావడం న్యామమేనా..
వెన్నెల వెలుగులో వికసించిన కలువను..
తెల్లారి వదిలేస్తావా..
కోనేటి నీరులా నిర్మలమైన మనసులో
నీ చూపులతో విసిరిన రాయి..
నా మదిలో నీ ఆలోచనల అలలు రేపింది..
మొన్న ఇదే గుడిలో నీకు గుర్తుందా..
స్వామి పల్లకీ సేవలో నన్ను
స్తంభం చాటున దాగిన నీ చూపు..
నా వీపును తడిమినప్పుడు..
నే ఛర్రున చూస్తే.. నువ్వు బిత్తర పోయావు
కానీ నీకు తెలీదు.. నీ చూపు నా వీపును కాదు
మనసును తాకిందని..
గుడి దాటుతున్న నీ చూపు ఆహ్వానం అందిన
నన్ను కలుసుకోడానికి మళ్లొస్తావని..
దైవం సాక్షిగా నా హృదిలో చేరిన నువ్వు..
శుభలగ్నాన చేయి పట్టుకోడానికి వస్తావని..
ఈ ఎదురుచూపు..
నదిలో కలువలు వాడకుండా..
నా మది నీరై.. కన్నీరై కారకుండా..
వస్తావా నేస్తం..

--నాగ్

ఫోటో : గూగుల్ వారిది అసలు ఓనరు తెలీదు.. వారికి కృతజ్ఞతలు

3 comments: