నాకు తెలుసు..
నీవికరావని..
అయినా.. ఆ మాట
నా మనసు నమ్మనంటోంది..
పెరటి చెట్టుకు తెలుసు..
తన నీడన ఇక మనం సేదతీరలేమని..
అయినా ఆశగా నీడనిస్తూనే వుంది..
గులాబీకి తెలుసు..
తన పువ్వు నీ జెడకు చేరదని..
అయినా పూస్తూనే వుంది..
ఈ గాలికీ తెలుసు..
నీ మేనును ఇక తాకలేనని..
అయినా ఆశగా ఇక్కడే తిరుగుతోంది..
నువ్వు మీటిన వీణ..
మౌన రాగం ఆలపిస్తోంది..
నీవు పలికిన పాట..
ఈ గదిలో వినిపించడం లేదు..
నువ్వు లేవు.. ఇక రావు..
నీ జ్ఞాపకాలు నన్ను నిలువ నీయవు..
అడుగడుగునా నీ శ్వాస..
నా చెవికిందన తగులుతోంది..
నీ పెదవి స్పర్శకు..
నా చెక్కిలి ఎదురు చూస్తోంది..
నను వీడే సమయాన..
నా గురించి ఆలోచించావో లేదో కానీ..
నీ వెళ్లిన ప్రతిక్షణం నా ఆలోచన నీవే..
నీ సహవాసంలో కాంతులీనిన
నా హృదయం..
నీవు లేక నిశీధిని తలపిస్తోంది..
నీకు తెలుసా.. తప్పు ఎవరిదైనా..
శిక్ష మగవాడికే..
విరహం.. నరకం..
నీ ఏడబాటు.. మరణం..
కొడిగట్టిన దీపాన్ని..
నీ చిరునవ్వుతో వెలిగించవా
--నాగ్
నీవికరావని..
అయినా.. ఆ మాట
నా మనసు నమ్మనంటోంది..
పెరటి చెట్టుకు తెలుసు..
తన నీడన ఇక మనం సేదతీరలేమని..
అయినా ఆశగా నీడనిస్తూనే వుంది..
గులాబీకి తెలుసు..
తన పువ్వు నీ జెడకు చేరదని..
అయినా పూస్తూనే వుంది..
ఈ గాలికీ తెలుసు..
నీ మేనును ఇక తాకలేనని..
అయినా ఆశగా ఇక్కడే తిరుగుతోంది..
నువ్వు మీటిన వీణ..
మౌన రాగం ఆలపిస్తోంది..
నీవు పలికిన పాట..
ఈ గదిలో వినిపించడం లేదు..
నువ్వు లేవు.. ఇక రావు..
నీ జ్ఞాపకాలు నన్ను నిలువ నీయవు..
అడుగడుగునా నీ శ్వాస..
నా చెవికిందన తగులుతోంది..
నీ పెదవి స్పర్శకు..
నా చెక్కిలి ఎదురు చూస్తోంది..
నను వీడే సమయాన..
నా గురించి ఆలోచించావో లేదో కానీ..
నీ వెళ్లిన ప్రతిక్షణం నా ఆలోచన నీవే..
నీ సహవాసంలో కాంతులీనిన
నా హృదయం..
నీవు లేక నిశీధిని తలపిస్తోంది..
నీకు తెలుసా.. తప్పు ఎవరిదైనా..
శిక్ష మగవాడికే..
విరహం.. నరకం..
నీ ఏడబాటు.. మరణం..
కొడిగట్టిన దీపాన్ని..
నీ చిరునవ్వుతో వెలిగించవా
--నాగ్

No comments:
Post a Comment