కాకీ.. చీమ.. మనిషి మాట్లాడుకుంటున్నారు..
కాకి చెప్పింది..
నేను స్నేహ ధర్మంలో గొప్ప..
ఒక్క స్నేహితుడికి ఆపద వచ్చిందంటే..
మొత్తం మా జాతి కదులుతుంది.. కావు కావు మంటూ గోల చేస్తుంది..
చీమ చెప్పింది..
సంఘ జీవనంలో మేము గొప్ప
ఒకరికోసం అందరం..
అందరి కోసం ఒక్కరం పాటుపడతాం
ఐక్యమత్యంగా సాగుతాం..
కాకీ చీమా రెండూ అడిగాయి
మనిషీ నీవు దేనిలో గొప్ప..?
మనిషి ఆలోచనలో పడ్డాడు..
అవును తాను దేనిలో గొప్ప..
స్నేహ ధర్మంలో కాకి పాటి చేయడు..
సమాజ ధర్మంలో చీమకి సాటి రాడు..
మరి దేనిలో గొప్ప
ఆలోచనలో పడ్డాడు..
అవును ఆ ఆలోచనలోనే గొప్ప..
ఆ ఆలోచన సవ్యంగా సాగితే గొప్ప..
ఆలోచన అమలు చేస్తే.. గొప్ప
ఆలోచన సమాజానికి ఉపయోగపడితే గొప్ప
తన ఆలోచన పదిమందికి మేలు చేస్తే గొప్ప
--నాగ్
ఫోటో : గూగుల్ వారిది.. అసలు ఓనరు ఎవరో తెలీదు వారికి కృతజ్ఞతలు
కాకి చెప్పింది..
నేను స్నేహ ధర్మంలో గొప్ప..
ఒక్క స్నేహితుడికి ఆపద వచ్చిందంటే..
మొత్తం మా జాతి కదులుతుంది.. కావు కావు మంటూ గోల చేస్తుంది..
చీమ చెప్పింది..
సంఘ జీవనంలో మేము గొప్ప
ఒకరికోసం అందరం..
అందరి కోసం ఒక్కరం పాటుపడతాం
ఐక్యమత్యంగా సాగుతాం..
కాకీ చీమా రెండూ అడిగాయి
మనిషీ నీవు దేనిలో గొప్ప..?
మనిషి ఆలోచనలో పడ్డాడు..
అవును తాను దేనిలో గొప్ప..
స్నేహ ధర్మంలో కాకి పాటి చేయడు..
సమాజ ధర్మంలో చీమకి సాటి రాడు..
మరి దేనిలో గొప్ప
ఆలోచనలో పడ్డాడు..
అవును ఆ ఆలోచనలోనే గొప్ప..
ఆ ఆలోచన సవ్యంగా సాగితే గొప్ప..
ఆలోచన అమలు చేస్తే.. గొప్ప
ఆలోచన సమాజానికి ఉపయోగపడితే గొప్ప
తన ఆలోచన పదిమందికి మేలు చేస్తే గొప్ప
--నాగ్
ఫోటో : గూగుల్ వారిది.. అసలు ఓనరు ఎవరో తెలీదు వారికి కృతజ్ఞతలు

No comments:
Post a Comment