పారిజాత పుష్పాలు రాలి పడుతున్నాయి..
నా పాదాలు ముద్దాడుతూ..
పావురాలు కువకువలు..
నా మదిలో నీ అలోచనలు కదిలిస్తూ..
సన్నని చిరుగాలి..
నీ పెదవి స్పర్శను గుర్తు చేస్తూ..
మేను పులకింత.. ఒణికిన పెదవి..
నీకోసం నే వేచి వున్నా.. కానీ..
నా ఆలోచనలు నిన్నెప్పుడో చేరిపోయాయి.
మెట్లమీద జారిన రాగి చెంబు..
నన్ను దాటి వెళ్తున్న జనం..
గుడిలో మోగిన హారతి గంట
ఉహూ.. నన్ను కదపలేక పోతున్నాయ్
వాళ్ళకేం తెలుసు..
నీ అడుగుల సవ్వడి మాత్రమే...
నా చైతన్య రహస్యమని
నేనొచ్చింది గుడికే... కానీ
నీ దర్శనం కోసమని..
ఎదురుచూపులో మజా ఏమిటో..
ఇప్పుడు నాకు తెలిసింది..
నీ పరోక్షంలో నీ తలపులకు..
సమయం చిక్కింది..
నువ్వొస్తే... ఆలోచనలా..
మాటే రాదుగా..
--నాగ్
నా పాదాలు ముద్దాడుతూ..
పావురాలు కువకువలు..
నా మదిలో నీ అలోచనలు కదిలిస్తూ..
సన్నని చిరుగాలి..
నీ పెదవి స్పర్శను గుర్తు చేస్తూ..
మేను పులకింత.. ఒణికిన పెదవి..
నీకోసం నే వేచి వున్నా.. కానీ..
నా ఆలోచనలు నిన్నెప్పుడో చేరిపోయాయి.
మెట్లమీద జారిన రాగి చెంబు..
నన్ను దాటి వెళ్తున్న జనం..
గుడిలో మోగిన హారతి గంట
ఉహూ.. నన్ను కదపలేక పోతున్నాయ్
వాళ్ళకేం తెలుసు..
నీ అడుగుల సవ్వడి మాత్రమే...
నా చైతన్య రహస్యమని
నేనొచ్చింది గుడికే... కానీ
నీ దర్శనం కోసమని..
ఎదురుచూపులో మజా ఏమిటో..
ఇప్పుడు నాకు తెలిసింది..
నీ పరోక్షంలో నీ తలపులకు..
సమయం చిక్కింది..
నువ్వొస్తే... ఆలోచనలా..
మాటే రాదుగా..
--నాగ్

No comments:
Post a Comment