పున్నమి వెన్నెల అడిగింది..
ఎందుకలా మౌనంగా అని..
చెప్పొచ్చు కదా.. ఏమైనా అని
నే చెప్పా.. నా భాషకు లిపి మౌనమే అని
మల్లెల సువాసన..
గులాబీల అందం..
సన్నజాజుల సౌకుమార్యం..
బంతి పూల రంగు..
వీటికి ఏ భాష వుందని..
నా మనసు లోని మాట..
ఎన్ని లక్షల అక్షరాలు గుది గుచ్చి
ఎన్నివేల పదాలను అల్లిక చేసినా..
చిన్న చిరునవ్వుకు సాటి రాదు కదా..
ఏ భాష తెలుసని..
గువ్వల జంట ప్రేమ చిహ్నం అయ్యింది
ఏ కవిత్వం వచ్చని
తాజ్ మహల్ ప్రేమికుల కోవెలైంది..
నీ మనసుకు వినే శక్తి వుంటే..
నా కనులు చెప్పే ఊసులు వినేవాడివి..
నీ మదిలో ప్రేమే వుంటే..
నా అడుగడుగునా నా మక్కువ తెలిసి వుండేది
నా వేదన నీకు అర్థమయ్యేది
--నాగ్
ఎందుకలా మౌనంగా అని..
చెప్పొచ్చు కదా.. ఏమైనా అని
నే చెప్పా.. నా భాషకు లిపి మౌనమే అని
మల్లెల సువాసన..
గులాబీల అందం..
సన్నజాజుల సౌకుమార్యం..
బంతి పూల రంగు..
వీటికి ఏ భాష వుందని..
నా మనసు లోని మాట..
ఎన్ని లక్షల అక్షరాలు గుది గుచ్చి
ఎన్నివేల పదాలను అల్లిక చేసినా..
చిన్న చిరునవ్వుకు సాటి రాదు కదా..
ఏ భాష తెలుసని..
గువ్వల జంట ప్రేమ చిహ్నం అయ్యింది
ఏ కవిత్వం వచ్చని
తాజ్ మహల్ ప్రేమికుల కోవెలైంది..
నీ మనసుకు వినే శక్తి వుంటే..
నా కనులు చెప్పే ఊసులు వినేవాడివి..
నీ మదిలో ప్రేమే వుంటే..
నా అడుగడుగునా నా మక్కువ తెలిసి వుండేది
నా వేదన నీకు అర్థమయ్యేది
--నాగ్

No comments:
Post a Comment