మనసు అద్దం మీద..
నేనేమిటీ ఇంత వికారంగా వున్నా..
ఎంత మేకప్పు వేసుకున్నా..
కరిగిపోతోందే..
ఎంత తెచ్చి పెట్టుకున్నా..
నా చిరునవ్వు కరిగిపోతోందేమిటి..
మందహాసం వెనుక కర్కశత్వమా..
నేను నీ పై చూపే ప్రేమ..
నా వాళ్ళ పట్ల చూపే..
బాధ్యత జాలీ నిజం కాదా..
ప్రేమ వెనుక ద్వేషం..దాష్టీకం దాగున్నాయా
పలకరింపులో తొనికిసలాడే..
అప్యాయత మచ్చుకు కూడా లేదేంటీ..
నే చూపే ధైర్యం.. గాంభీర్యం
పిపీలకంలా ఎగిరిపోయిందా..
నేను చేసే దానం..
స్వార్థమేనా..
నా ప్రతిభ.. ప్రగతి..
సహచరుల కష్టమేనా..
నా మాటల్లో ధ్వనించే సత్యం..
అబద్దమేనా..
నా నడకలో ధీమా..
తప్పటడుగుల తడబాటేనా..
నే చూపే చొరవ.. కలుపుకోలు తనం
ఒంటరితనం కప్పి పుచ్చడానికా
నా లోని నలుపు కప్పేయడానికా..
ఈ తెల్లని కోటు..
నా హావ భావాలు..
నిత్యం నటనేనా..
మనసులోకి తొంగి చూడటం..
అంతర్ముఖం..
ఇంత భయంకరమా..
నేను ఆత్మ వంచనకు మరో పేరా..
మంచితనం ముసుగులో
నేనో రాక్షసుడినా..
మనసు అద్దంలో నా నిజరూపం..
నేనేనా..
నేనొక్కడినేనా..
మరి మీరు..?
--నాగ్
ఫోటో : గూగుల్ వారిది.. అసలు ఓనరు ఎవరో తెలీదు వారికి కృతజ్ఞతలు
నేనేమిటీ ఇంత వికారంగా వున్నా..
ఎంత మేకప్పు వేసుకున్నా..
కరిగిపోతోందే..
ఎంత తెచ్చి పెట్టుకున్నా..
నా చిరునవ్వు కరిగిపోతోందేమిటి..
మందహాసం వెనుక కర్కశత్వమా..
నేను నీ పై చూపే ప్రేమ..
నా వాళ్ళ పట్ల చూపే..
బాధ్యత జాలీ నిజం కాదా..
ప్రేమ వెనుక ద్వేషం..దాష్టీకం దాగున్నాయా
పలకరింపులో తొనికిసలాడే..
అప్యాయత మచ్చుకు కూడా లేదేంటీ..
నే చూపే ధైర్యం.. గాంభీర్యం
పిపీలకంలా ఎగిరిపోయిందా..
నేను చేసే దానం..
స్వార్థమేనా..
నా ప్రతిభ.. ప్రగతి..
సహచరుల కష్టమేనా..
నా మాటల్లో ధ్వనించే సత్యం..
అబద్దమేనా..
నా నడకలో ధీమా..
తప్పటడుగుల తడబాటేనా..
నే చూపే చొరవ.. కలుపుకోలు తనం
ఒంటరితనం కప్పి పుచ్చడానికా
నా లోని నలుపు కప్పేయడానికా..
ఈ తెల్లని కోటు..
నా హావ భావాలు..
నిత్యం నటనేనా..
మనసులోకి తొంగి చూడటం..
అంతర్ముఖం..
ఇంత భయంకరమా..
నేను ఆత్మ వంచనకు మరో పేరా..
మంచితనం ముసుగులో
నేనో రాక్షసుడినా..
మనసు అద్దంలో నా నిజరూపం..
నేనేనా..
నేనొక్కడినేనా..
మరి మీరు..?
--నాగ్
ఫోటో : గూగుల్ వారిది.. అసలు ఓనరు ఎవరో తెలీదు వారికి కృతజ్ఞతలు

No comments:
Post a Comment