నేను మాయం అయిపోయా..
నువ్వు తాళీ కట్టిన మరుక్షణమే..
ప్రేయసిగా మాయమైపోయా..
అదేమిటో అదేక్షణం..
నీ ప్రేమా.. లాలన కూడా మాయమయ్యాయ్..
నువ్వు గమనించావా..
నీ మీద నా ప్రేమ పెరిగితే..
చిత్రంగా..
నా మీద నీ అధికారం పెరిగింది
నాటి కలలసౌధం..కూలిపోతుంటే..
ఆ శిధిలాలపై నువ్వు..
అధికార పీఠం అందుకుంటున్నావ్
ఒక్క క్షణమైనా నన్ను వదలలేని నువ్వు..
రోజంతా ఆఫీసులోనే వుంటున్నావు..
నా పేరు రామ కోటిలా రాసి
అబ్బుర పరిచిన నువ్వే..
అదే పేరును ఏమే.. ఒసేగా మార్చేశావు..
నాతో కప్పు కాఫీ కోసం..
రోజులు వెంటబడిన నువ్వే..
నాతో కలిసి భోజనానికి
సమయం లేదంటున్నావ్..
ఈ మార్పు నీదా.. మన పెళ్లిదా..
అందని ద్రాక్ష పుల్లన అంటారే..
నే అందాక చేదు అయ్యానా..
నిర్లక్ష్యం భూతం అయితే..
అది నన్నెప్పుడో కభళీంచింది..
నిరీక్షణ సర్పమైతే..
అది ఎప్పుడో నన్ను కాటేసింది..
ప్రేమకు పరాకాష్ట పెళ్లి అని ఎవరన్నారు..
పెళ్లితోనే ప్రేమ నాశనం అని నే నంటాను
మన ప్రేమను పెళ్లిగా మార్చి..
పెద్దలు గెలిచారు..
ప్రేమను పెళ్లితో చంపి..
మనం ఓడిపోయాం..
మన మధ్య ఇప్పటి మంచుతెర..
అదే రేపటి ఇనుప గోడ..
శ్రీ వారు అనే పిలుపులో గౌరవం వుంది..
ప్రియా అనడంలో ప్రేమ వుంది..
నువ్వు గౌరవాన్నే ప్రేమిస్తే..
నే మౌనాన్ని ఆశ్రయిస్తా..
--నాగ్
నువ్వు తాళీ కట్టిన మరుక్షణమే..
ప్రేయసిగా మాయమైపోయా..
అదేమిటో అదేక్షణం..
నీ ప్రేమా.. లాలన కూడా మాయమయ్యాయ్..
నువ్వు గమనించావా..
నీ మీద నా ప్రేమ పెరిగితే..
చిత్రంగా..
నా మీద నీ అధికారం పెరిగింది
నాటి కలలసౌధం..కూలిపోతుంటే..
ఆ శిధిలాలపై నువ్వు..
అధికార పీఠం అందుకుంటున్నావ్
ఒక్క క్షణమైనా నన్ను వదలలేని నువ్వు..
రోజంతా ఆఫీసులోనే వుంటున్నావు..
నా పేరు రామ కోటిలా రాసి
అబ్బుర పరిచిన నువ్వే..
అదే పేరును ఏమే.. ఒసేగా మార్చేశావు..
నాతో కప్పు కాఫీ కోసం..
రోజులు వెంటబడిన నువ్వే..
నాతో కలిసి భోజనానికి
సమయం లేదంటున్నావ్..
ఈ మార్పు నీదా.. మన పెళ్లిదా..
అందని ద్రాక్ష పుల్లన అంటారే..
నే అందాక చేదు అయ్యానా..
నిర్లక్ష్యం భూతం అయితే..
అది నన్నెప్పుడో కభళీంచింది..
నిరీక్షణ సర్పమైతే..
అది ఎప్పుడో నన్ను కాటేసింది..
ప్రేమకు పరాకాష్ట పెళ్లి అని ఎవరన్నారు..
పెళ్లితోనే ప్రేమ నాశనం అని నే నంటాను
మన ప్రేమను పెళ్లిగా మార్చి..
పెద్దలు గెలిచారు..
ప్రేమను పెళ్లితో చంపి..
మనం ఓడిపోయాం..
మన మధ్య ఇప్పటి మంచుతెర..
అదే రేపటి ఇనుప గోడ..
శ్రీ వారు అనే పిలుపులో గౌరవం వుంది..
ప్రియా అనడంలో ప్రేమ వుంది..
నువ్వు గౌరవాన్నే ప్రేమిస్తే..
నే మౌనాన్ని ఆశ్రయిస్తా..
--నాగ్

No comments:
Post a Comment