Sunday, 13 September 2015

నా ఆకలి..

నా ఆకలి..
పంచభూతాల నేస్తం..
అందుకే అవి ఎప్పుడూ నాతోనే..
ఒకసారి గాలితో కడుపు నింపితే..
మరో రోజు నీరుతాగి సంతృప్తి చెందుతుంది..
నిత్యం జడరాగ్ని నాతోనే..
నేలతల్లి ఆహ్వానించిన రోజున ఇక అక్కడే చెలిమి..
నా ఆకలి విశ్వాంతరాళం..
దానికి అంతం ఏమో కానీ ఆరంభమే లేదు..
గరళాన్ని కంఠంలో దాచి విర్రవీగే శివా..
ఒక్కపూట ఆకలి కడుపులో దాచి చూడు తెలుస్తుంది..
నీ గొప్ప
--నాగ్

No comments:

Post a Comment