Monday, 14 September 2015

నీ నిరీక్షణ

నీ నిరీక్షణ నా కోసమా..
నీ కళ్లు వెదికేది నన్నా..
నీ హృదయ స్పందన నాదేనా..
దైవం సాక్షిగా నీ అక్ష్యం నేనా
నీ వేదనకు ఆవేదనకు,,
కారణం నేనా..
నమ్మలేని .. నిజం

నీ రాగం నా కోసమంటే..
ఆ భావం నాదంటే..
నన్ను తాకుతున్న
నీ నిట్టూర్పులో వేడి..
నా ఎదను చుట్టేస్తున్న..
నీ చూపు..
నీ నీలి కన్నుల వెలుగు..
ఇది నిజమని చెబుతున్నాయ్..
గుడి గంటలు ఆశీర్వదిస్తుంటే..
పది మెట్లు ఒక్క అడుగులో
దాటేసి వస్తున్న..
చేజారిందనుకున్న అదృష్టాన్ని..
కన్నీటితో అందుకోడానికి వస్తున్నా..
ఇన్నేళ్ల వేదనకు నీ చిరునవ్వుతో
స్వస్తి పలకడానికి వస్తున్నా..
--నాగ్
ఫోటో : గూగుల్ వారిది.. అసలు ఓనరు ఎవరో తెలీదు వారికి కృతజ్ఞతలు

No comments:

Post a Comment