కొన్ని కథలంతే..
కన్నీరిస్తాయి..
కన్నీరు కార్పిస్తాయి.
మనసును పట్టి పీడిస్తాయి..
గుండెను మునివేళ్లతో కెలికి..
జ్ఞాపకాలు వెలికి తీస్తాయి..
తప్పులను ఎత్తి చూపి..
పశ్చత్తాపంతో చచ్చేలా చేస్తాయి..
ఆనంద క్షణాలు వాటికి దొరకవు..
పాలూ నీళ్లూ వేరు చేసే హంసల్లా..
కన్నీళ్లనే వేరు చేసి మిగుల్చుతాయి..
కారణం ఏదైనా..
ప్రతి కష్టానికీ నిన్నే బాధ్యుడిని చేస్తాయ్
ఓడిన క్షణాలను..
కళ్లముందు ఫ్రేములు కట్టి పెడతాయి
అవమానాలను ముద్దరేశి..
మనసుపై అతికిస్తాయి..
అంతే..
అసమర్థుని కధలు ఇలానే వుంటాయ్
నువ్వు ఎగరేసిన గాలి పటం..
వేరెవడికో దొరుకుతుంది..
నీ చేతిలో మిగిలిన దారం ముక్క
నిన్ను వెక్కిరిస్తుంది..
కొన్ని కథలంతే..
శుభం అక్షరాలు చిరిగిపోయిన కాగితాలవి..
--నాగ్
ఫోటో : గూగుల్ వారిది అసలు ఓనరు తెలీదు.. వారికి కృతజ్ఞతలు
కన్నీరిస్తాయి..
కన్నీరు కార్పిస్తాయి.
మనసును పట్టి పీడిస్తాయి..
గుండెను మునివేళ్లతో కెలికి..
జ్ఞాపకాలు వెలికి తీస్తాయి..
తప్పులను ఎత్తి చూపి..
పశ్చత్తాపంతో చచ్చేలా చేస్తాయి..
ఆనంద క్షణాలు వాటికి దొరకవు..
పాలూ నీళ్లూ వేరు చేసే హంసల్లా..
కన్నీళ్లనే వేరు చేసి మిగుల్చుతాయి..
కారణం ఏదైనా..
ప్రతి కష్టానికీ నిన్నే బాధ్యుడిని చేస్తాయ్
ఓడిన క్షణాలను..
కళ్లముందు ఫ్రేములు కట్టి పెడతాయి
అవమానాలను ముద్దరేశి..
మనసుపై అతికిస్తాయి..
అంతే..
అసమర్థుని కధలు ఇలానే వుంటాయ్
నువ్వు ఎగరేసిన గాలి పటం..
వేరెవడికో దొరుకుతుంది..
నీ చేతిలో మిగిలిన దారం ముక్క
నిన్ను వెక్కిరిస్తుంది..
కొన్ని కథలంతే..
శుభం అక్షరాలు చిరిగిపోయిన కాగితాలవి..
--నాగ్
ఫోటో : గూగుల్ వారిది అసలు ఓనరు తెలీదు.. వారికి కృతజ్ఞతలు

No comments:
Post a Comment