Sunday, 13 September 2015

పడిలేవడమే మన గొప్పతనం..

పక్షి (హుధూద్)అనుకున్నా..
రాబందైంది..
గాలే అనుకున్నా..
కొంపలు కూల్చింది..
కెరటమే కదా అనుకున్నా..
బతుకులు ఊడ్చేసింది..
ప్రకృతితో పోరాటం కాదు కానీ..
గౌరవించడమే మేలు కదా..
రాకాసి అలకు..
తలవంచితే తప్పులేదు..
నష్టాలు చూసి గుండెలు బాదుకోకు నేస్తం..

ఇది..మన
మానవత్వానికి పరీక్షా సమయం..
సుందర నగరం విశాఖ పట్టణం
మరింత సుందరంగా తీర్చిదిద్దే అవకాశం
మనమూ ఓ చెయ్యేద్దాం..

తుపానుపై గెలవడం కాదు..
పడిలేవడమే మన గొప్పతనం..

--నాగ్

హుదుత్ తుపాను సమయంలో  రాసిన కవిత

అక్టోబరు 2014

No comments:

Post a Comment