Sunday, 13 September 2015

నా వేదనకు..నువ్వే..






నా వేదనకు.. కన్నీటికి కారణం    
నువ్వే..
నా కలలపైనా పెత్తనం నీదేనా..
రెప్పమూయగానే ప్రత్యక్షమవుతావు..
పో పొమ్మన్నా.. కసిరి కొట్టినా
మనసును కొమ్మ చేసి ఊపుతావు..

ఎవరని నువ్వు.. మనసుకు చేరువయ్యావు
ఏ అపచారం జరిగిందని దూరమయ్యావు
కనుల కొలనులో కలువ పూయదని..
తెలిసీ.. కన్నీటి మడుగులు చేస్తున్నావు..
ఇంత వేదనలోనూ నాదో చిరు ఆశ
రాలిన కన్నీటి పుష్పాలను ఏరుకోడానికైనా..
నువ్వొస్తావని..
నా దు:ఖం లోనూ.. నీ దర్శనం కోసం..
ఆశగా చూస్తున్నా.. ప్రభూ..
 --నాగ్
ఫోటో : గూగుల్ వారిది అసలు ఓనరు తెలీదు.. వారికి కృతజ్ఞతలు

No comments:

Post a Comment