Sunday, 13 September 2015

నా అక్షరాలు పేచీ పెడుతున్నాయ్

అక్షరాలు పేచీ పెడుతున్నాయ్
మారాం చేసే చిన్నారుల్లా సతాయిస్తున్నాయ్
ఒక్కో ఆకారాన్ని వరుస చేసి..
పదం కూర్చాలని నేను చేసే ప్రయత్నం..
నచ్చనట్టుగా మొరాయిస్తున్నాయి
కష్టపడి వాటిని కూర్చినా.. చెదిరిపోతున్నాయి
గుండెల్లో వేదన.. ఉదరంలో బడభాగ్ని రగిలిస్తున్నాయి..
అలిగాయా.. అపార్థం చేసుకున్నాయా
నా భావం నచ్చకనా.. నా కదలిక నచ్చకనా..
ఏమో.. ఎందుకో నాలో వేదన రగిలిస్తున్నాయి..
అవునేమో.. నా చేతిలో వాటికి సుఖం ఎక్కడిది..?
నిత్యం వేదన.. కన్నీరించడమేగా వాటి పని
ఆరోపణలు.. విమర్శలేగా వాటికిచ్చింది..
సుందర ప్రకృతి.. ఆనందాల హరివిల్లు ..
ఎప్పుడు ఆవిష్కరించానని..
ఎప్పుడూ కాలే కడుపులు.. మండే కన్నేళ్లేగా..
అందుకే ఎదురు తిరుగుతున్నాయ్..
నన్నొదిలి పోతానని బెధిరిస్తున్నాయ్..
అక్షరమే ఆసరా లేకపోతే..
ఈ దీనుడికి భలమేదీ..
బలహీనుడికి బరోసా ఎక్కడ..
అందుకే బతిమాలుతున్నా.. అక్షర దేవతలను..
పేదోడి జట్టు వదలొద్దని.. నా కలంలో ఇంకుగా
మారమని..

--నాగ్
 నోట్ : ఫోటో నాది కాదు గూగుల్ వారి నుంచి ఎరువు తెచ్చింది.. అసలు ఓనరు నాకు తెలీదు.. వారికి కృతజ్ఞ్టతలు

No comments:

Post a Comment