Sunday, 13 September 2015

పోలీసుని మార్చుకుందాం

చిమ్మ చీకటి..
ఎముకలు కొరికే చలి..
దూరంగా కుక్కల అరుపులు
అంతా ఇంట్లో కంబళీ కప్పుకుని కమ్మగా నిద్రపోయే వేళ..
ఒకే వ్యక్తి లాఠీ నేలకు తాటిస్తూ..
విజిల్ ఊదుతూ..
పట్టణంలో గస్తీ తిరుగుతుంటాడు..
మన ఆస్తులు.. మాన ప్రాణాలకు
రక్షకుడు.. రక్షక భటుడు..
ప్రతికూల పరిస్థితులలోనూ స్పందించే వ్యక్తి

సమాజంలో మంచీ చేడూ రెండూ వుంటాయి..
ప్రతి రంగంలోనూ ఆ వైవిధ్యం వుంది..
పోలీసులోనూ మంచీ చెడూ వున్నాయ్
కానీ ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇవ్వడం..
సహాయం కోసం ప్రాణాలకు తెగించడం..
సరిహద్దులో సైనికుడికి..
సరిహద్దు లోపల పోలీసుకే చెల్లింది..
రాంగురూట్ లో బైకు ఆపి..
వంద అడిగే వాడు కాదు పోలీసు
ముష్కరులు చుట్టిముడితే.. ప్రాణాలొడ్డేవాడు పోలీసు
అటువంటి రక్షకుడికి.. నా ప్రణామాలు..
అమర వీరులకి నా జోహార్లు..

పోలీసును నమ్ముదాం..
పోలీసుని గౌరవిద్దాం..
పోలీసుని మార్చుకుందాం
--నాగ్

No comments:

Post a Comment