చూట్టూ కొండలు..చెట్టూ చేమలే ప్రేక్షకులు..
పిట్టలు వేసే విజిల్స్..
సెలయేటి గలగల ల చప్పట్లు..
నెత్తిన అప్పుడే కోసిన గుమ్మడి
జోలెలో నాలుగు నెలల బిడ్డ..
చేతిలో అడ్డిపిక్కల సంచి..
ఎర్రని మట్టి రోడ్డుపై..
భారంగా నడిచొచ్చే..
ఓ గిరిజన మగువ..
నీ నడక అందం..
ఏ పిల్లి నడకల సుందరికొస్తుంది..
చమట బిందువుల రత్నాలు ధరించిన..
నీ మోము చందం..
ఏ ప్రపంచ సుందరి కాదంటుంది..?
(నా ఊహకు తగిన ఫోటో కాదిది.. అయినా బావుందనిపించి పోస్టు చేశా)
--నాగ్
ఫోటో : గూగుల్ వారిది అసలు ఓనరు తెలీదు.. వారికి కృతజ్ఞతలు
No comments:
Post a Comment