నేనంటే.. నాకు చాలా ఇష్టం..
నీకు నచ్చిన నేనంటే.. నాకు భలే ఇష్టం
నీ రాక కోసం కాపలా కాసే..
నా కళ్లంటే నాకెంతో ఇష్టం.
నీ ఎదురుచూపులో అలసి సొలసి..
కుమిలే నా హృదయం వేదనలోనూ ఇష్టం
నువ్వు తిట్టినా.. పొగిడినా..
మధుర సంగీతంలా వినిపించే నా చెవులంటే..
నాకు ఇష్టం
సాయం సమయం..
నీ చేతిలో చేయి వేసి నడిచే వెళ..
నీచేతిలో నా చేయి వెచ్చదనం.. మహా ఇష్టం..
చిరుగాలి వేళ..
నీ మునివేళ్లతో నా నుదిటిపై .. సవరించిన
నా కురులంటే నాకు ఇష్టం
ఇసుక తిన్నెలపై జారిన సమయాన్న..
నీ చేతికి చిక్కిన నా నడుము వంపు మరీ ఇష్టం
సంధ్య చీకట్లో.. నా చెక్కిలిపై నీ వెచ్చని శ్వాస..
నా చెక్కిలంటే.. నాకు అందుకే ఇష్టం
నీ పై ప్రేమను ప్రకటించే నా పెదవులంటే..
నీకంటే.. నాకే ఇష్టం..
చిరాకు పడినా.. చిందులేసినా..
నువ్వు ప్రాణమిచ్చే.. నేనంటే..
నాకెంతో ఇష్టం..
--నాగ్
ఫోటో : గూగుల్ నుంచి తీసుకున్నది.. ఒరిజినల్ ఓనర్ నాకు తెలీదు వారికి కృతజ్ఞతలునీకు నచ్చిన నేనంటే.. నాకు భలే ఇష్టం
నీ రాక కోసం కాపలా కాసే..
నా కళ్లంటే నాకెంతో ఇష్టం.
నీ ఎదురుచూపులో అలసి సొలసి..
కుమిలే నా హృదయం వేదనలోనూ ఇష్టం
నువ్వు తిట్టినా.. పొగిడినా..
మధుర సంగీతంలా వినిపించే నా చెవులంటే..
నాకు ఇష్టం
సాయం సమయం..
నీ చేతిలో చేయి వేసి నడిచే వెళ..
నీచేతిలో నా చేయి వెచ్చదనం.. మహా ఇష్టం..
చిరుగాలి వేళ..
నీ మునివేళ్లతో నా నుదిటిపై .. సవరించిన
నా కురులంటే నాకు ఇష్టం
ఇసుక తిన్నెలపై జారిన సమయాన్న..
నీ చేతికి చిక్కిన నా నడుము వంపు మరీ ఇష్టం
సంధ్య చీకట్లో.. నా చెక్కిలిపై నీ వెచ్చని శ్వాస..
నా చెక్కిలంటే.. నాకు అందుకే ఇష్టం
నీ పై ప్రేమను ప్రకటించే నా పెదవులంటే..
నీకంటే.. నాకే ఇష్టం..
చిరాకు పడినా.. చిందులేసినా..
నువ్వు ప్రాణమిచ్చే.. నేనంటే..
నాకెంతో ఇష్టం..
--నాగ్

No comments:
Post a Comment