Saturday, 12 September 2015

కర్రల కొట్టు..

పశువుల సంతలో ఆ మూల..ఈ కర్రల కొట్టు.. అక్కడే పలుపు తాళ్లు కూడా
మనోళ్లు ఎంత గొప్పోళ్లంటే..
పశువుని కొంటూనే..
దానిని అదిలించే కర్ర..
కట్టేసే పలుపు తాడూ కొంటున్నారు..
కర్రల్లో చాలా రకాలే వున్నాయి..
సన్నని.. లావు.. పొట్టి .. పొడవు..
కొన్ని కొండ పొగ ముద్రలు వేసినవీ వున్నాయి..
ఒక్కోదానికి ఒక్కో ధర..
బహుశా పశువుకు తగిలే దెబ్బను బట్టి రేటు పెరుగుతుందేమో..
రైతులు కర్రలు ఒంచి.. ఒడుపు చూసీ.. కొంటున్నారు..
కొందరు కర్రని గాలిలో తిప్పుతున్నారు..
మరి కొందరు కర్ర ఎక్కడి నుంచి తెచ్చారో అడుగుతున్నారు..
సంతలో పశువులు కర్రల కట్ట వైపు చూస్తున్నాయి..
వాటికి తెలీదు.. వాటిలో ఏ కర్ర తమ వీపు విమానం మోత మోగిస్తుందో..
రంగు రంగుల తాళ్లు కళ్లకు ఇంపుగా..
వాటిలో ఏది తమ మూతి బిగిస్తుందో..
ఏది తమ కాళ్లకు బంధం అవుతుందో వాటికి తెలీదు..
బంగారు కొట్టులో నగను మెడలో వేసుకుని చూసినట్టు..
పశువుల మూతికి ముట్టె బుట్టెలు బిగించి చూస్తున్నారు..
కర్రల కొట్టు.. చాలా రద్దీగా వుంది..
టెర్రలిస్టుల ఆయుధ దుకాణంలా..

--నాగ్
ఫోటో : పిఠాపురం పశువుల సంతలోని కర్రల దుకాణం
నోట్ : ఇది నచ్చితే లైక్ కొట్టండి.. ఇంకా నచ్చితే కామెంట్ పెట్టండి.. అంతకన్నా బాగా నచ్చితే.. షేర్ చేసుకోండి.. నచ్చకపోతే.. దీని వంక చూడకండి
అంతేకానీ కాపీ పేస్టు చేయొద్దు.. అది హేయం.. భావ చౌర్యం. ఇది నా మిత్రులు ఎవరూ చేయరు.. బయట పెద్ద పెద్ద బ్లాగులు, కమ్యూనిటీ పేజీలు నిర్వహిస్తున్న పెద్దలకే ఈ చిన్న బుద్దులు

No comments:

Post a Comment