నా పని నన్ను చేయనివ్వండి..
దయచేసి ఉచిత సలహాలు మానండి..
క్రికెట్లో సచిన్ కి..
చదరంగంలో విశ్వనాద్ ఆనంద్ కీ
రాజకీయంలో చంద్రబాబుకి సైతం
సలహాలిచ్చే మేధావులూ..
నా పని నన్ను చేయనివ్వండి..
ఇది మీ పని కాదు.. నా జీవితం
ఏ నష్టమైనా మీకు కాదు.. నాకే..
ఇలా చేయి.. అలా చేయి అనేముందు..
అదేదో మీరు చేస్తే మంచిది..
ఇలా వెళ్లు.. అలా వెళ్లు.. అనడానికి ముందు..
వెళ్లి చూపితే ఇంకా మంచిది
సలహాలకు పరిష్కారాలు రావిక్కడ
అనుభవాలతో పని అసలే లేదు
జీవిత చదరంగంలో కొత్త ఎత్తులే.. నడుస్తాయ్
కొత్త ఆలోచనలే పారతాయి
నలుగురి దారిలో ఒకరు నడిచే రోజులు కావు ఇవి..
ఎవడి దారి వాదు వెదుక్కుంటేనే మంచిది..
అందుకే.. నన్నొదిలేయండి..
నా ఆలోచనలు ఒడిసిపట్టి.. పిండే పని
మానుకోండి..
--నాగ్
నోట్ : ఫోటో నాది కాదు గూగుల్ వారి నుంచి ఎరువు తెచ్చింది.. అసలు ఓనరు నాకు తెలీదు.. వారికి కృతజ్ఞ్టతలు

No comments:
Post a Comment