Sunday, 13 September 2015

అద్బుతమైనదే..

జీవితం చాలా చిన్నది..
అందుకే ప్రతి చిన్న విషయమూ
అద్బుతమైనదే..

తొలిముద్దు..
తొలివాన చినుకు..
సీతా కోక చిలుక రంగులు..
ఎర్రని మావి చిగురు..
కాలువలో కాకమ్మ స్నానం..
తాటి బుర్రగుంజు రుచి..
పావలాకు నాలుగు జీళ్లు..
కొత్త ఆవకాయ ఘాటు..
వరినాట్లు వేస్తూ.. ఎంకిపాట..
పక్కింటి పాప తొక్కుడుబిళ్ల ఆట..
ఊర చెరువులో గేదెపై సవారీ..
తాతయ్య దగ్గు..
అమ్మమ్మ ఏడు చేపల కథ..
అన్నీ అన్నీ ముఖ్యమే..

మనసు పాకురాయి మీద
జారిపోతున్నా..
ఎక్కడో మటం వేసుకుని కూర్చున్న
జ్ఞాపకాలు అన్నీ ముఖ్యమైనవే..
తిరిగిరాని అనుభూతుల
రసాలు.. హృదయాన్ని పట్టి పిండితే..
ఆ నొప్పి కూడా అవసరమే..

--నాగ్

నోట్ : ఫోటో నాది కాదు గూగుల్ వారి నుంచి ఎరువు తెచ్చింది.. అసలు ఓనరు నాకు తెలీదు.. వారికి కృతజ్ఞ్టతలు

No comments:

Post a Comment