ఈ పిల్లగాలిది
ఎంత పెంకితనం..
నీ కురులను చెదరగొడుతోంది..
ఈ వెన్నెలకి ఎంత కుళ్లు..
తనను మించిన వెలుగు నీలో వుందని..
చందమామ చిన్నబుచ్చుకుంది..
నీ మోము అందానికి..
ఇదిగో మల్లెతీగ సిగ్గుపడుతోంది
నీ నడుము తన కన్నా సన్ననైనదని..
సంపెంగ ముక్కులెగరేస్తోంది చూడు
తనను మించిన సుగంధం నీ సొత్తని..
గలగలల సెలయేరు సడి లేదు..
నీ నవ్వుల కిలకిలల ముందు వినిపించనని..
లేడి తన పరుగు ఆపి నిన్నే కళ్లప్పగించి చూస్తోంది..
తన కళ్లను నీ నయనాలలో కనుగొన్నదేమో..
మన్మధుడెందుకు నా వంక
అసూయగా చూస్తున్నాడు..
రతీదేవిని మించిన నీ అందం
నా సొంతమైందనేమో..
--నాగ్
ఫోటో : గూగుల్ వారిది అసలు ఓనరు తెలీదు.. వారికి కృతజ్ఞతలు
ఎంత పెంకితనం..
నీ కురులను చెదరగొడుతోంది..
ఈ వెన్నెలకి ఎంత కుళ్లు..
తనను మించిన వెలుగు నీలో వుందని..
చందమామ చిన్నబుచ్చుకుంది..
నీ మోము అందానికి..
ఇదిగో మల్లెతీగ సిగ్గుపడుతోంది
నీ నడుము తన కన్నా సన్ననైనదని..
సంపెంగ ముక్కులెగరేస్తోంది చూడు
తనను మించిన సుగంధం నీ సొత్తని..
గలగలల సెలయేరు సడి లేదు..
నీ నవ్వుల కిలకిలల ముందు వినిపించనని..
లేడి తన పరుగు ఆపి నిన్నే కళ్లప్పగించి చూస్తోంది..
తన కళ్లను నీ నయనాలలో కనుగొన్నదేమో..
మన్మధుడెందుకు నా వంక
అసూయగా చూస్తున్నాడు..
రతీదేవిని మించిన నీ అందం
నా సొంతమైందనేమో..
--నాగ్
ఫోటో : గూగుల్ వారిది అసలు ఓనరు తెలీదు.. వారికి కృతజ్ఞతలు

No comments:
Post a Comment