ఎవరో అడిగారు..
నువ్వు ప్రేమించావా అని..
ఏం చెప్పను..?
నిన్ను చూసిన ప్రతి సారీ..
హృదయంలో అలజడి..
అప్రయత్నంగా పెదవిపై చిరునవ్వు..
నడకలో తడబాటు..
మాటల్లో ఒణుకు..
ఇవన్నీ ప్రేమేనా..
అవునేమో.. అయినా..
నీకే చెప్పని నా ప్రేమను..
ఎవరికైనా ఎలా చెప్పను..?
--నాగ్
ఫోటో : గూగుల్ వారిది అసలు ఓనరు తెలీదు.. వారికి కృతజ్ఞతలు
No comments:
Post a Comment