Sunday, 13 September 2015

//నడుస్తున్నా..//


//
నడుస్తున్నా..//
నడుస్తున్నా..
కాళ్ల కింద మెత్తని, పచ్చని గడ్డి ఒత్తుగా
గడ్డి చిగుళ్ల చివర మంచుబింధువులు చల్లగా..
గాల్లో తడిచిన మట్టి వాసన మత్తుగా..
నడుస్తున్నా... గమ్యం లేకుండా..
నడక బావుంది కదా.. హాయిగా..
హఠాత్తుగా కాళ్లకు గులక రాళ్లు..
ఎర్రటి ఎండలో కాగి.. కాళ్లు కాలుస్తూ..
అడుగులు వేగంగా వేస్తున్నా రాళ్లు తరగడం లేదు..
వెనక్కి తిరిగి చూస్తే.. మంచులో తడిచిన నేల లేదు..
పరుగు తీస్తున్నా.. అలసటగా..
ఆసరా లేదు..పరుగెడుతున్నా కష్టంగా..
గొంతెండుతోంది.. అడుగు పడటం లేదు..
జారిపోతున్నా.. కొండ చివరన..
అదిగో ఆప్పుడు దొరికింది నీ చేయి
భరోశా.. ధీమా ఇస్తూ..
మెత్తని నీ చేతి స్పర్శలో.. నాటి మంచు తడి..
చల్లదనం.. హాయి..

--నాగ్
నోట్ : ఫోటో నాది కాదు గూగుల్ వారి నుంచి ఎరువు తెచ్చింది.. అసలు ఓనరు నాకు తెలీదు.. వారికి కృతజ్ఞ్టతలు

No comments:

Post a Comment